Cricket World Cup 2023: బంగ్లాదేశ్‌పై  ఇంగ్లాండ్ రికార్డుల మోత..ఆల్‌టైం రికార్డ్ బ్రేక్ చేసిన మలాన్  

Cricket World Cup 2023: బంగ్లాదేశ్‌పై  ఇంగ్లాండ్ రికార్డుల మోత..ఆల్‌టైం రికార్డ్ బ్రేక్ చేసిన మలాన్  

పరుగుల వరద పారించడం, ప్రత్యర్థులకు చుక్కలు చూపించడం, బౌండరీల వర్షం కురిపించడం ఇంగ్లాండ్ కి కొత్తేమి కాదు. వరల్డ్ కప్ లో భాగంగా ప్రస్తుతం బంగ్లాదేశ్ పై జరుగుతున్న మ్యాచులో ఇంగ్లాండ్ టాపార్డర్ బంగ్లా బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. డేవిడ్ మలాన్ 107 బంతుల్లో 16 ఫోర్లు 5 సిక్సులతో 140 పరుగులు  చేయగా.. రూట్ 68 బంతుల్లో 8 ఫోర్లు ఒక సిక్సర్ తో 82 పరుగులు చేసాడు. వీరిద్దరి విజ్రంభనతో ఇంగ్లాండ్ 9 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. ఈ క్రమంలో వీరిద్దరూ ఒక అరుదైన రికార్డ్ తమ ఖాతాలో వేసుకున్నారు.

స్టార్ ఓపెనర్ డేవిడ్ మలాన్ 107 బంతుల్లోనే 140 పరుగులు చేసి వన్డేల్లో వేగంగా 6 సెంచరీలు చేసిన బ్యాటర్ గా ఆల్ టైం రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు పాకిస్థాన్ ఓపెనర్ ఇమాముల్ హక్ పేరిట ఉంది. ఇమామ్ మొదటి ఆరు సెంచరీలు చేయడానికి 27 ఇన్నింగ్స్ లు అవసరమైతే మలాన్ కేవలం 24 ఇన్నింగ్స్ లోనే ఈ రికార్డ్ బ్రేక్ చేసాడు.కాగా.. మలాన్ కి వన్డేలో ఈ ఏడాది నాలుగో సెంచరీ కావడం విశేషం.             
 
స్టార్ ఆటగాడు జో రూట్ 82 పరుగులు చేసి ఇంగ్లాండ్ తరపున వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. వ్యక్తిగత స్కోర్ 67 పరుగుల వద్ద గ్రాహం గూచ్ రికార్డ్ బ్రేక్ చేసాడు. గూచ్ వరల్డ్ కప్ లో 897 పరుగులు చేయగా.. తాజాగా రూట్ ఆ రికార్డుని అధిగంమించాడు. 

ALSO READ : వివాదంగా మారిన పోస్టర్.. బీజేపీపై రైతు పరువునష్టం దావా